Nara Brahmani : తెలంగాణ సచివాలయంలో ఏపీ సీఎం కోడలు..

తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు.

Update: 2024-09-19 11:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ బోర్డుతో సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. గురువారం జరిగిన ఈ బోర్డు మీటింగ్‌లో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, యూనివర్సిటీ బోర్డు చైర్మన్ ఆనంద్ మహీంద్రా, కో చైర్మన్ శ్రీని రాజు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, వివిధ రంగాల పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారితో పాటు ఏపీ సీఎం చంద్రబాబు కోడలు, మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి పాల్గొన్నారు. అయితే, నారా బ్రహ్మణి హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

అయితే, తెలంగాణలో ఏర్పాటు చేయబోయే స్కిల్ యూనివర్సిటీ‌లో భాగంగా ఆమె చర్చల్లో పాల్గొనడం ఆసక్తిగా మారింది. కాగా, యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఈ ఏడాది దసరా నుంచి ఆరు కోర్సులతో తరగతులు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల వద్ద 57 ఎకరాల స్థలంలో స్కిల్ వర్సిటీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. కానీ, ఈ ఏడాది తాత్కాలికంగా ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా లేక న్యాక్ లేదా నిథమ్‌లో వర్సిటీ నిర్వహించేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.


Similar News