తెలుగు రాష్ట్రాలకు మరో రెండు వందే భారత్ రైళ్లు

తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది.

Update: 2024-09-13 12:07 GMT

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తెలంగాణ (Telangana), ఏపీ(AP) రాష్ట్రాలకు చెరొక వందే భారత్ (Vande Bharat) రైలును బహుమతిగా అందిస్తున్నట్టు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణకు నాగపూర్ - హైదరాబాద్, ఏపీకి దుర్గ్ - విశాఖపట్టణం వందే భారత్ రైళ్లను ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) వర్చువల్ గా ప్రారంభించనున్నట్టు కిషన్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. కాగా ఇప్పటికే తెలంగాణకు 4 వందే భారత్ రైళ్లు ఉండగా, ఇది 5వ రైలు అన్నారు. దేశ రాజధానికి ఢిల్లీ తర్వాత అత్యధిక వందే భారత్ రైళ్ల అనుసంధానం కలిగిన నగరం హైదరాబాద్ మాత్రమే అని మంత్రి పేర్కొన్నారు.


Similar News