కొత్త సెక్రటేరియట్‌కు మరో టెన్షన్.. సీఎస్ఓ కీలక నిర్ణయం

కొత్త సెక్రటేరియట్‌కు ప్రస్తుతం 24 గంటల పాటు సుమారు 700 మంది పోలీసులు పహారా కాస్తున్నారు.

Update: 2023-05-04 02:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : కొత్త సెక్రటేరియట్‌కు ప్రస్తుతం 24 గంటల పాటు సుమారు 700 మంది పోలీసులు పహారా కాస్తున్నారు. సాయంత్రం సమయంలో సచివాలయాన్ని చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఆ ప్రాంతమంతా సెల్ఫీలతో హంగామా చేస్తున్నారు. దీనికి తోడు సెక్రటేరియట్‌ చూసేందుకు విజిటర్స్‌కు అనుమతి ఇవ్వడంతో సాధారణ ప్రజలు పాసులు తీసుకుని లోపలికి వెళ్తున్నారు. దీంతో పహారా మరింత పటిష్టం చేయాల్సిన అవసరం ఉన్నదని, అందుకే ఇంకా 400 మంది పోలీసులు అవసరమని సెక్యూరిటీ బాధ్యతలు చూస్తున్న టీఎస్ఎస్పీ ఆఫీసర్లు పేర్కొంటున్నారు.

విపక్షాల ఆందోళన భయం

నూతన సెక్రటేరియట్‌కు భద్రతగా ఉన్న పోలీసులకు విపక్షాల ఆందోళన భయం పట్టుకున్నది. సచివాలయానికి మొత్తం నాలుగు గేట్లు ఉన్నాయి. ఆందోళన కారులు తెలుగుతల్లి ఫ్లై ఓవర్, మింట్ కంపౌండ్, ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ మార్గ్‌ల ద్వారా ఏ క్షణమైన సెక్రటేరియట్ ముందుకొచ్చి ఆందోళన చేసే ఛాన్స్ ఉన్నది. వారిని కట్టడి చేయాలంటే మరింత ఫోర్స్ కావాలని పోలీసు అధికారులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ప్రస్తుతం ఉన్న స్టాఫ్‌కు అదనంగా మరింత మంది సిబ్బంది కావాలని రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలుస్తున్నది.

Tags:    

Similar News