Phone tapping case : ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్.. మారిన ఆ సీరియల్ నెంబర్
ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు దూకుడు పెంచారు.
దిశ, క్రైమ్ బ్యూరో : ఫోన్ ట్యాపింగ్ కేసులో హైదరాబాద్ పోలీసులు దూకుడు పెంచారు. నలుగురు పోలీసు అధికారుల అరెస్ట్, కస్టడీ విచారణ తర్వాత కొంత సైలెంట్‌గా ఉన్న పోలీసులు ఇప్పుడు దర్యాప్తులో వేగాన్ని పెంచారు. అయితే మీడియాకు లీకులు లేకుండా కోర్టుకు సమాచారం ఇస్తూ దర్యాప్తు స్పీడ్‌ను పెంచారు. ఇప్పటి వరకు ఫోన్ ట్యాపింగ్ కేసులో A-1 ప్రణీత్ రావు, A-2 భుజంగా రావు, A-3 తిరుపతన్న, A-4 రాధాకిషన్ రావు ఉన్నారు. వీరి అరెస్ట్, కస్టడీ తర్వాత సేకరించిన ఆధారాలతో అనుమానితులుగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులు నిందితులుగా పోలీసులు నిర్ధారించి కోర్టు లో మెమో దాఖలు చేశారు. దీంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల సంఖ్య 6 కు చేరింది. నిందితుల సీరియల్ నెంబర్‌లు కూడా మారాయి. A-1 ప్రభాకర్ రావు, A2 ప్రణీత్ రావు, A-3 భుజంగా రావు, A-4 తిరుపతన్న, A-5 రాధాకిషన్ రావు, A6 శ్రవణ్ రావులుగా ఎఫ్ఐఆర్‌లో నమోదు చేశారు. ఇందులో శ్రవణ్ రావు ఓ న్యూస్ ఛానల్ ముసుగులో ఫోన్ ట్యాపింగ్ డెన్‌లు నిర్వహించాడని అతని ఇల్లు, ఆఫీస్‌లపై పోలీసులు సోదాలు జరిపిన విషయం తెలిసిందే..