MLA Bhupathi Reddy: ఆంధ్రోడివి...ఆంధ్రోడిలాగానే ఉండు : కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి హెచ్చరిక
హీరో అల్లు అర్జున్(Allu Arjun)విషయమై స్పందించవద్దని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) , పీసీసీ(PCC)లు ఆదేశించినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు తమ విమర్శల దాడి ఆపడం లేదు
దిశ, వెబ్ డెస్క్ : హీరో అల్లు అర్జున్(Allu Arjun)విషయమై స్పందించవద్దని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), పీసీసీ(PCC)లు ఆదేశించినా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నాయకులు తమ విమర్శల దాడి ఆపడం లేదు. అల్లు అర్జున్ పై నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. నువ్వో పగటి వేశాడవని, ఓ చెత్త సినిమా ఎర్ర చందనం స్మగ్లర్ పుష్ప తీశావంటూ మండిపడ్డారు. అదేమైనా సమాజాన్ని బాగు పరిచే సినిమానా అని చురకలేశారు. తెలంగాణకు నీవు చేసిందేముందంటూ దుయ్యబట్టారు. మీ వ్యాపారాలు మీ సినిమాలేవో చేసుకుని మీ బతుకు మీరు బతుకండని హితవు పలికారు.
నువ్వు ఆంధ్రోడివి...ఆంధ్రోడిలాగానే ఉండి..నీవు బ్రతకడానికి తెలంగాణకు వచ్చావు.. అలాగే బ్రతుకు మీకిచ్చిన గౌరవాన్ని కాపాడుకుని మీ వ్యాపారాలేవే చేసుకోండన్నారు. కొడకా మా సీఎం రేవంత్ రెడ్డిని ఏమైనా అంటే నీ సినిమాలు ఆడనివ్వమని హెచ్చరించారు. ఓయూ జేఏసీ వాళ్లు అల్లు అర్జున్ ఇంటిపై ఏదో చేశారని, తన వైఖరి మార్చుకోకుంటే నీ సినిమాల్ని సైతం తెలంగాణలో ఆడనివ్వం కొడుకా అని భూపతిరెడ్డి హెచ్చరించారు.