Medak MP : కొమురయ్య మృతిపై విచారణ జరపాలి

సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బడం పేట బీజేపీ గ్రామ బూత్ కమిటీ అధ్యక్షుడు కొమురయ్య మృతిపై విచారణ జరపాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు.

Update: 2024-11-02 12:35 GMT

 దిశ, నర్సాపూర్ : సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం బడం పేట బీజేపీ గ్రామ బూత్ కమిటీ అధ్యక్షుడు కొమురయ్య మృతిపై విచారణ జరపాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. శనివారం ఆయన నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న కొమురయ్య మృతదేహాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శుక్రవారం బడం పేట గ్రామంలో ట్రాక్టర్ ప్రమాదంలో మృతి చెందిన కొమురయ్య మృతి పై వారి కుటుంబ సభ్యులకు అనుమానం ఉన్నందున విచారణ చేయించాలని కోరారు. ఎంతో భవిష్యత్తు ఉన్న కొమురయ్య అకస్మాత్తుగా మృతి చెందడం బాధాకరమని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళి యాదవ్, నర్సాపూర్ అసెంబ్లీ కన్వీనర్ రమణారావు, సీనియర్ నాయకులు మల్లేష్ గౌడ్, కౌన్సిలర్లు బుచ్చేష్ యాదవ్, సురేష్ నాయకులు ఆంజనేయులు గౌడ్, అరవింద్ గౌడ్ తదితరులు ఉన్నారు.


Similar News