సూర్యాపేటలో ఒకే ఇంటిపై వానర సైన్యం దాడి! వీడియో వైరల్

సూర్యాపేట జిల్లాలో వానర సైన్యం దండయాత్ర చేస్తోంది. గ్రామాల్లోని ఇండ్లల్లో కోతులు చొరబడి వస్తువులను ధ్వంసం చేస్తున్నాయి.

Update: 2024-08-31 07:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సూర్యాపేట జిల్లాలో వానర సైన్యం దండయాత్ర చేస్తోంది. గ్రామాల్లోని ఇండ్లల్లో కోతులు చొరబడి వస్తువులను ధ్వంసం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే వాటిని తరిమికొట్టే ప్రయత్నం చేస్తే.. వారిపై దాడి చేస్తున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రం భగత్ సింగ్ నగర్లోని ఓ ఇంటి పైన వందకు పైగా కోతులు వచ్చి చేరాయి.

ఆ ఇంటిపై దాడి చేస్తున్నట్లుగా దాదాపు రెండు గంటల‌ పాటు రణరంగం సృష్టించాయి. సూర్యాపేట-దంతాలపల్లి ప్రధాన రోడ్డువెంట ఉన్న ఈ కాలనీకి చేరిన కోతులు రెండు గుంపులుగా విడిపోయి దాడులు చేసుకుంటూ నానా హంగామా చేశాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కోతుల నుంచి తమను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. గతంలోనూ సూర్యాపేట జిల్లాలో వానర సైన్యం ప్రజలను బెంబేలెత్తించిన ఘటనలు చాలా ఉన్నాయి. తుంగతుర్తి, జాజిరెడ్డిగూడెం, నాగారం లాంటి పలు మండలాల్లో కోతులు రైతులు, ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేశాయి. 


Similar News