యాదగిరి గుట్టపై పర్వత వర్థినిగా దర్శనమిచ్చిన అమ్మవారు

యాదగిరి గుట్ట అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు అమ్మవారు పర్వత వర్ధిని అలంకారంలో దర్శనమిచ్చారు.

Update: 2024-10-08 08:25 GMT

దిశ, వెబ్ డెస్క్ : యాదగిరి గుట్ట అనుబంధ ఆలయమైన శ్రీ పర్వత వర్ధినీ సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో శ్రీదేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఆరవ రోజు అమ్మవారు పర్వత వర్ధిని అలంకారంలో దర్శనమిచ్చారు. పర్వత వర్ధిని అవతారంలో అమ్మవారిని దర్శించుకున్న భక్తులు భక్తి పారవశ్యంతో పులకించారు. కుంకుమార్చనల్లో దంపతులు భారీ సంఖ్యలో పాల్లొన్నారు. ప్రాతఃకాల పూజ అర్చనలు, పారాయణములు, గాయత్రీ జపములు, లలిత సహస్రనామార్చన, మధ్యాహ్న పూజ నీరాజన, మంత్రపుష్పములు, తీర్థప్రసాద వితరణలు అర్చకులు శాస్త్రయుక్తంగా నిర్వహించారు. సాయంకాలం శ్రీదేవి నవావరణ పూజ, సహస్రనామార్చన, నీరాజనం, మంత్రపుష్పములు, తీర్థ ప్రసాద వితరణ కార్యక్రమాలు కొనసాగాయి.

అటు మంగళవారం పురస్కరించుకుని క్షేత్ర పాలకుడు శ్రీ ఆంజనేయ స్వామికి ఆకూపూజ, సింధూర సేవోత్సం నిర్వహించారు. శ్రీ లక్ష్మినరసింహ స్వామి ప్రధానాలయంలో స్వామిఅమ్మవార్ల నిత్యారాధనలు, నిత్యకల్యాణోత్సవాలు అర్చక బృందం శాస్రయుక్తంగా కొనసాగించింది. భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. 


Similar News