అమీన్ పీర్ దర్గాకు రజినీకాంత్, ఏఆర్ రెహమాన్

ప్రముఖ సినీనటుడు రజినీకాంత్ ఏపీలో పలు దేవాలయాలను సందర్శించారు. తొలుత కుమార్తె సౌందర్యతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరంతిరుపతి నుండి

Update: 2022-12-15 12:39 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : ప్రముఖ సినీనటుడు రజినీకాంత్ ఏపీలో పలు దేవాలయాలను సందర్శించారు. తొలుత కుమార్తె సౌందర్యతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరంతిరుపతి నుండి రోడ్డు మార్గంలో వైఎస్ఆర్ కడప జిల్లాలోని ప్రఖ్యాత అమీన్ పీర్ దర్గాకు చేరుకున్నారు. దర్గాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సైతం అక్కడకు చేరుకున్నారు. దీంతో రజనీకాంత్, ఏఆర్ రెహమాన్, ఐశ్వర్య రజినీకాంత్‌లకు దర్గా పెద్దలు సంప్రాదాయ ప్రకారం స్వాగతం పలికారు. దర్గా ప్రతినిధులు వారికి పూల మాల వేసి ఘనంగా స్వాగతం పలికారు.

సంప్రదాయబద్ధమైన కాషాయ తలపాగాను ధరింపజేశారు. కండువాను మెడలో వేసుకున్నారు. అరగంట పాటు దర్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా దర్గా విశిష్ఠతను రజినీకాంత్, ఏఆర్ రెహమాన్‌,సౌందర్య రజినీకాంత్‌లకు దర్గా పెద్దలు వివరించారు. రజినీకాంత్, ఏఆర్ రెహ్మాన్ కడపలో ప్రత్యక్షం కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది. అభిమానులు పెద్ద ఎత్తున అమీన్ పీర్ దర్గాకు చేరుకున్నారు. వారిని చూసేందుకు ఎగబడ్డారు. సెల్ఫీల కోసం పోటీ పడ్డారు. రజినీకాంత్ ఇటీవలే తన బర్త్ డే వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ప్రస్తుతం జైలర్ సినిమాలో యాక్ట్ చేస్తున్నారు. ఒకవైపు బర్త్ డే..మరోవైపు సినిమా విజయవంతం కావాలని రజినీకాంత్ తిరుమల శ్రీవారిని, దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేసినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..