అంబేద్కర్ వర్సిటీ పీహెచ్‌డీ ఎంట్రన్స్ నోటిఫికేషన్ విడుదల

డా.బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

Update: 2024-04-26 16:05 GMT
అంబేద్కర్ వర్సిటీ పీహెచ్‌డీ ఎంట్రన్స్ నోటిఫికేషన్ విడుదల
  • whatsapp icon

దిశ, తెలంగాణ బ్యూరో: డా.బీఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం 2023-24 విద్యా సంవత్సరానికి పీహెచ్‌డీ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి కామర్స్, ఇంగ్లీష్, ఎడ్యుకేషన్, ఎకనామిక్స్, హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ కోర్సులలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఆన్‌లైన్‌లో డెబిట్, క్రెడిట్ కార్డ్ ద్వారా లేదా టీఎస్/ఏపీ ఆన్‌లైన్ ఫ్రాంఛైజీ కేంద్రాలలో మే 5 లోపు చెల్లించాలన్నారు. పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష మే 25న హైదరాబాద్‌ కేంద్రంలో మాత్రమే నిర్వహిస్తామని తెలిపారు. అభ్యర్థులు విశ్వవిద్యాలయ వెబ్ పోర్టల్ www.braou.ac.in/www.braouonline.in నందు 'ఆన్‌లైన్' ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. ఎంట్రన్స్ ఫీజు రూ.1,500, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు అభ్యర్థులకు రూ.వెయ్యిగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం విశ్వవిద్యాలయ పోర్టల్‌ను www.braouonline.in లేదా వెబ్‌సైట్ www.braou.ac.in అలాగే ఏమైనా సందేహాలుంటే 040-23680411/498/240‌లో సంప్రదించవచ్చని సూచించారు.

Tags:    

Similar News