అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనుల్లో రాజీ పడొద్దు: మంత్రి కొప్పుల ఆదేశం

గడువులోగా అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు.

Update: 2023-03-15 15:50 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గడువులోగా అంబేద్కర్ విగ్రహ నిర్మాణ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. పనుల్లో జాప్యం లేకుండా వేగంగా పనులు చేపట్టాలన్నారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌ తీరాన నిర్మిస్తున్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేదర్‌ విగ్రహం నిర్మాణ పనులను బుధవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజున విగ్రహం ఆవిష్కరించునున్నట్లు తెలిపారు. అంబేద్కర్‌ ఆశయాలు, ఆలోచనలను భవిష్యత్‌ తరాలు నిత్యం స్మరించుకునేలా 125 అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు.

ఏప్రిల్‌ 5లోగా అన్ని పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ప్రధాన విగ్రహం, ల్యాండ్‌సేప్‌ ఏరియా, రాక్‌ గార్డెన్‌, లాన్స్‌లో ప్లాంటేషన్‌, పార్లమెంట్‌ ఆకృతి వచ్చే స్థంభాల సాండ్‌ స్టోన్‌ వర్స్‌, వాటర్‌ ఫౌంటైన్‌, పారింగ్‌ ఏరియా, మెయిన్‌ ఎంట్రన్స్‌ క్లాడింగ్‌ వర్స్‌, గ్రానైట్‌ ఫ్లోరింగ్‌, అధునాతన ఆడియో, వీడియో రూం తదితర అన్ని రకాల పనులకు చార్ట్‌ రూపొందించుకొని ముందుకు సాగాలని, అందుకు సరిపడా మ్యాన్‌పవర్‌ను పెంచాలని సూచించారు. ఆయన వెంట అధికారులు పాల్గొన్నారు.

Tags:    

Similar News