Allu Arjun: అల్లు అర్జున్‌కు రాంగోపాల్ పేట పోలీసుల నోటీసులు
సంధ్య థియేటర్ ఘటన కేసులో అరెస్టు రెగ్యూలర్ బెయిల్ మంజూరైన సినీ హీరో అల్లు అర్జున్ ఆదివారం చిక్కడపల్లి పొలీస్ స్టేషన్ కు వచ్చి హజరైయ్యారు.
దిశ, తెలంగాణ బ్యూరో : సంధ్య థియేటర్ ఘటన కేసులో అరెస్టు రెగ్యూలర్ బెయిల్ మంజూరైన సినీ హీరో అల్లు అర్జున్ ఆదివారం చిక్కడపల్లి పొలీస్ స్టేషన్ కు వచ్చి హజరైయ్యారు. బెయిల్ మంజూరు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో హజరు కావాలని ఆదేశించడంతో హజరై పోలీస్ స్టేషన్ రికార్డులలో సంతకం చేశారు. రెండు నెలల పాటు ప్రతి ఆదివారం అల్లు ఆర్జున్ చిక్కడపల్లి పోలీస్ట స్టేషన్ కు హజరుకావాలి కోర్టు ఉత్తర్వులలో పేర్కోంది. నాంపల్లి కోర్టు షరతులతో కూడిన రెగ్యూలర్ బెయిల్ శుక్రవారం మంజూరు చేసింది. శనివారం నాంపల్లికోర్టుకు వెళ్ళి రూ.50ల పర్సనల్ బాండ్ , ఇద్దరి వ్యక్తుల షూరిటిలు సమర్పించారు.
అల్లు అర్జున్ రాంగోపాల్ పేట పోలీసుల నోటీసులు
సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పోందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించేందుకు కిమ్స్ హస్పిటల్ కు రావద్దంటూ రాంగోపాల్ పేట పోలీసులు అల్లు అర్జున్ కు నోటిసులు ఆదివారం అందజేశారు. రెగ్యూలర్ మంజూరు కావడంతో పర్యామర్శించాడానికి వస్తారని ముందుస్తూ జగ్రత్త చర్యలలో భాగంగా ఈ నోటీసులు అందజేసినట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్ వస్తే ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతాయని, ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరిగే ప్రమాదం ఉందని భావిస్తూ నోటీసులు అందజేశారు. ఇటీవల అల్లు అర్జున్ ఇంటీ వద్ద ఓయూ జేఏసీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఇటువంటీ ఘటనలు దృష్టిలో ఉంచుకుని కిమ్స్ హస్పిటల్ కు రావద్దని నోటీసులలో తెలిపారు .