Allu Arjun : అల్లు అర్జున్ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది : డీజీపీ జితేందర్

Update: 2024-12-29 09:28 GMT

దిశ, వెబ్ డెస్క్ : సంధ్య థియేటర్ తొక్కిసలాట(Sandhya Theater stampede incident) ఘటన..అల్లు అర్జున్ అరెస్టు.(Allu Arjun arrested) కేసులో పోలీస్ శాఖ దర్యాప్తు కొనసాగుతోందని డీజీపీ జితేందర్ (DGP Jitender) తెలిపారు. తెలంగాణ పోలీస్ శాఖ వార్షిక నివేదిక విడుదల సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సంధ్యా థియేటర్ ఘటన కేసు పురోగతిలో ఉందని, నిందితులందిరిపై కేసులు నమోదు చేశామన్నారు. అల్లు అర్జున్ కేసు ఇప్పటికే వేర్వేరు కోర్టుల్లో విచారణలో ఉన్నందునా మాట్లాడేది ఏమి లేదన్నారు. చట్టప్రకారమే కోర్టుల్లో పోలీస్ శాఖ ముందుకెలుతుందన్నారు.

రాష్ట్రంలోనూ సైబర్ క్రైమ్ రేట్ పెరిగిందని డీజీపీ తెలిపారు. దేశంలోనే మొదటి సారి 2.42 కోట్ల నగదు సైబర్ నేరగాళ్ల నుండి కాపాడమని, 180 కోట్ల నగదు బాధితులకు అందజేశామని, 10 వేల ఐఎంఈఏ నెంబర్లు బ్లాక్ చేశామని వెల్లడించారు. ఈ ఏడాది డయాల్ 100 కాల్స్ 16,92 వేల కాల్స్ రిసివ్ చేసుకున్నామని, 7నిమిషాల వ్యవధిలో ఘటన స్థలానికి చేరుకోగలిగామని, 1000 పెట్రోల్ కార్లు, 2,100 బ్లు కొల్ట్స్ పోలీస్ కానిస్టేబుల్ అఫీసర్స్ విధులు నిర్వహిస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఏడాది బాధితులు పోగొట్టుకున్న 75 వేల ఫోన్స్ ట్రేస్ చేసామని, రికార్డు స్థాయిలో నవంబర్ మాసంలో 38వేల ఫోన్స్ బాధితులకు సైతం అందజేసామని తెలిపారు. ప్రభుత్వం నిర్ణయం మేరకు ట్రాన్స్ జెండర్ లను విధుల్లోకి తీసుకున్నామని, మహిళలు చిన్నారుల రక్షణ పోలీస్ బాధ్యత పోలీస్ హెల్ప్ లైన్ లో భాగంగా 29,600 ట్రాక్ చేశామని, రౌడీ షీటర్ లపై కఠిన చర్యలు తీసుకున్నామని, 18 కేసులు నమోదు చేసామని, దులో 35 మంది రౌడీ షీటర్ లకు కన్విక్షన్ వచ్చిందని, 77 పోక్సో కేసులు నమోదు అయ్యాయని, ఇందులో 82 కేసులలో నిందితులకు శిక్ష పడిందని వివరించారు. 

Tags:    

Similar News