Manikrao Thakre : లెఫ్ట్ పార్టీలతో పొత్తు.. మాణిక్ రావు ఠాక్రే కీలక వ్యాఖ్యలు

వామపక్షాలతో పొత్తు అంశంపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్ రావు ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-11-02 06:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: వామపక్షాలతో పొత్తు అంశంపై కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జి మాణిక్ రావు ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. లెఫ్ట్ పార్టీలతో పొత్తులుంటాయన్నారు. కేసీఆర్‌ను గద్దె దించే విషయంలో కమ్యూనిస్టులదీ.. తమది ఒకటే ఆకాంక్ష అన్నారు. వామపక్షాలతో చర్చలు కొనసాగుతున్నాయన్నారు. హైదరాబాద్‌లో కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడుల అంశంమై స్పందించిన ఆయన దాడుల వెనుక బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర ఉందన్నారు. వివేక్ చేరికతో చెన్నూర్‌లో తమకు బలమైన అభ్యర్థి దొరికారన్నారు. కమ్యూనిస్టులు మాకు అవసరమే అని.. ప్రత్యామ్నాయం చూస్తున్నామన్నారు. ఇక పొత్తుల విషయంలో కాంగ్రెస్ దాటవేత ధోరణిని ఉభయ కమ్యూనిస్టు పార్టీలు తప్పుపట్టిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..