బ్రేకింగ్: ఆలేరు ఎమ్మెల్యే భర్త మహేందర్ రెడ్డిపై రాళ్ల దాడి..!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‌ల్లో పెద్ద ఎత్తున క్యూలో నిల్చున్నారు. ఇవాళ ఉదయం 7 గంటలకు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ బూత్‌ల్లో పెద్ద ఎత్తున క్యూలో నిల్చున్నారు. ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 36.68 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాకలో ఉద్రిక్తత నెలకొంది. బీఆర్‌ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత భర్త మహేందర్ రెడ్డి పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు యత్నించారు. ఈ క్రమంలో మహేందర్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మహేందర్ రెడ్డి కారుపై రాళ్ల దాడి జరిగింది. ఈ దాడిలో పాక్షికంగా మహేందర్ రెడ్డి కారు ధ్వంసమైంది. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. కాంగ్రెస్ కార్యకర్తలే రాళ్ల దాడి చేశారని బీఆర్ఎస్ శ్రేణలు ఆరోపించారు.