S CT ఎస్ఐ అభ్యర్థులకు అలర్ట్.. ఇవాళ్టి నుంచే!

తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ నెల 26న జరగనున్న ఎస్ సీటీ ఎస్ఐ టెక్నికల్ పేపర్ రాత పరీక్షకు హాల్ టికెట్లు ఇవాళ(మార్చి 21) ఉదయం 8 గంటల నుంచి అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలిపింది.

Update: 2023-03-21 03:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ నెల 26న జరగనున్న ఎస్ సీటీ ఎస్ఐ టెక్నికల్ పేపర్ రాత పరీక్షకు హాల్ టికెట్లు ఇవాళ(మార్చి 21) ఉదయం 8 గంటల నుంచి అందుబాటులో ఉంచబోతున్నట్లు తెలిపింది. మార్చి 24వ తేది అర్థరాత్రి 12 గంటల వరకు అభ్యర్థులు https://www.tslprb.in/ వెబ్ సైట్ ద్వారా ఈ హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు వీలుంటుందని రిక్రూట్ మెంట్ బోర్డు ఓ ప్రకటనలో పేర్కొంది. డౌన్ లోడ్ చేసుకున్న హాల్ టికెట్‌పై అభ్యర్థులు తమ పాస్ పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలని, ఫోటో లేని వారిని పరీక్షకు అనుమతించబోమని అధికారులు హెచ్చరించారు. ఎవరికైనా హాల్ టికెట్లు డౌన్ లోడ్ కాకుంటే అలాంటి అభ్యర్థులు support@tslprb.in కు ఈ మెయిల్‌ చేయడం ద్వారా లేదంటే 9393711110, 93910 05006 నెంబర్లకు ఫోన్‌ చేయడం ద్వారా హాల్‌ టికెట్లను పొందవచ్చని అధికారులు సూచించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..