అలర్ట్: నాలుగు రోజుల పాటు బయటకు రావొద్దు..!
ఈ నెల(ఏప్రిల్)10వ తేదీ నుంచి ఉమ్మడి కరీంనగర్‌లో ఎండలు భగ్గుమంటున్నాయి.
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల(ఏప్రిల్)10వ తేదీ నుంచి ఉమ్మడి కరీంనగర్‌లో ఎండలు భగ్గుమంటున్నాయి. అయితే అక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 26 డిగ్రీలు గానూ.. గరిష్ట ఉష్ణోగ్రతలు 42డిగ్రీలు గానూ నమోదయ్యాయి. కాగా అప్పటి నుంచి ఈ ఉష్ణోగ్రతలు ఏ మాత్రం తగ్గకుండా, పెరగకుండా.. 42 డిగ్రీలపైనే ఉంటున్నాయి. జిల్లాలో గ్రానైట్, ఇసుక క్వారీలు, బొగ్గు గనులు ఎక్కువగా ఉండడం వల్ల ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యాయి. ఈ ఎండల ప్రభావం వల్ల అనారోగ్యానికి గురయ్యే అవకాశాలున్నాయని, అత్యవసర సమయంలో తప్ప మిగతా టైమ్‌లో 4,5 రోజుల పాటు అస్సలు బయటకు రావద్దని వైద్యులు సూచనలు చేస్తున్నారు.