దిశ, వెబ్‌డెస్క్: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో అలయ్ బలయ్ కార్యక్రమం అట్టహాసంగా మొదలైంది. ప్రతి ఏటా దసరా సందర్భంగా హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. రాజకీయాలకు అతీతంగా అలయ్ బలయ్ కార్యక్రమం నిర్వహించడం ఎప్పటినుంచో ఆనవాయితీగా వస్తోంది. కాగా.. ఈ ఏడాది కార్యక్రమం కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో వైభవంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి బండారు దత్తాత్రేయ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. వీరితో పాటు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, వివిధ రాష్ట్రాల గవర్నర్లు హరిబాబు, విజయశంకర్, గుర్మిత్ సింగ్ కూడా హాజరయ్యారు. అతిథులకు తెలంగాణ సాంస్కృతిక బృందాలతో స్వాగతం పలకడం జరిగింది. తెలంగాణ సంప్రదాయ వంటలతో భోజన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. కాగా.. ప్రస్తుతం కొడంగల్‌లో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరికొద్ది సేపట్లో హైదరాబాద్ చేరుకుని ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు.