తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్‌గా ఆకునూరి మురళి

ప్రీప్రైమరీ నుంచి సాంకేతిక విద్య, యూనివర్సిటీ స్థాయి విద్య వరకు నూతన విద్యావిధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘తెలంగాణ విద్యా కమిషన్‌'ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

Update: 2024-09-06 17:07 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రీప్రైమరీ నుంచి సాంకేతిక విద్య, యూనివర్సిటీ స్థాయి విద్య వరకు నూతన విద్యావిధానాన్ని రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ‘తెలంగాణ విద్యా కమిషన్‌’ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నది. తాజాగా.. ఈ కమిషన్ నిర్వహణ బాధ్యతలు కీలక వ్యక్తికి అప్పగించింది. తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని నియమించింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాదు.. వ్యవసాయ కమిషన్ చైర్మన్‌గా కోదండరెడ్డి, బీసీ కమిషన్ చైర్మన్‌గా జి.నిరంజన్‌ను నియమించింది. బీసీ కమిషన్ సభ్యులుగా రాపోలు జయప్రకాశ్, తిరుమలగిరి సురేందర్, బాల లక్ష్మిలను నియమించారు.


Similar News