‘అంత ఆశామాషీగా చచ్చేవాడిని కాదు’.. అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అక్బరుద్దీన్ ఓవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముక్తార్ అన్సారీ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తే నన్ను
దిశ, వెబ్‌డెస్క్: ఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అక్బరుద్దీన్ ఓవైసీ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ముక్తార్ అన్సారీ కుటుంబ సభ్యుల్ని పరామర్శిస్తే నన్ను చంపుతామని కొందరు సోషల్ మీడియాలో బెదిరిస్తున్నారు. కానీ నేను అంత ఆశామాషీగా చచ్చేవాడిని కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. తనకేమైనా జరిగితే తర్వాత జరిగేదానికి మీరే బాధ్యులని అన్నారు. కాగా, గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ ముక్తార్ అన్సారీ ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఓ జైలులో శిక్ష అనుభవిస్తూ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అన్సారీ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్తే తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఓవైసీ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి.