గుంటూరు కారం మూవీలో తక్షణమే ఆ రెండు పేర్లు తొలగించాలి: AIYF డిమాండ్

గుంటూరు కారం సినిమాలో విలన్స్‌కు మార్క్స్, లెనిన్ పేర్లు పెట్టడాన్ని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండించింది.

Update: 2024-01-16 16:12 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గుంటూరు కారం సినిమాలో విలన్స్‌కు మార్క్స్, లెనిన్ పేర్లు పెట్టడాన్ని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండించింది. ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలి ఉల్లా ఖాద్రీ, కార్యదర్శి కె. ధర్మేంద్రలు మీడియాతో సంయుక్తంగా మాట్లాడారు. గుంటూరు కారం సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్‌కు మతి భ్రమించిందని ధ్వజమెత్తారు. శ్రామికవర్గ నేతలు, మార్క్సిస్ట్ మహోపాధ్యాయుల పేర్లు పెట్టి సమాజానికి తప్పుడు అవగాహన కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. డైరెక్టర్ త్రివిక్రమ్, హీరో మహేష్ బాబు జరిగిన తప్పిదానికి బేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తక్షణమే సినిమా నుంచి ఇద్దరి పేర్లు తొలగించేలా సెన్సార్ బోర్డ్ చర్యలు చేపట్టాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, ఈ ఆందోళనలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు హెచ్చరించారు.

Tags:    

Similar News

టైగర్స్ @ 42..