AICC: ‘హైడ్రా’‌‌కు ఏఐసీసీ ఫుల్ సపోర్ట్..! కూల్చివేతలపై హస్తినకు ఫిర్యాదుల వెల్లువ

హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై కాంగ్రెస్ అధిష్టానం పాజిటివ్‌గా రిసీవ్ చేసుకున్నట్లు సమాచారం.

Update: 2024-08-28 02:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: హైడ్రా అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై కాంగ్రెస్ అధిష్టానం పాజిటివ్‌గా రిసీవ్ చేసుకున్నట్లు సమాచారం. రాష్ట్రంలో చెరు‌వులు, కుంటలను కాపాడేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను సమర్ధించినట్లు తెలుస్తోంది. హైడ్రా కూల్చివేతలపై కొంతమంది సొంత పార్టీ నేతలు, ఇతరులు ఏఐసీసీకి ఫిర్యాదు చేసినట్లు చర్చ జరుగుతోంది.

సొంత లీడర్ల నుంచే ఫిర్యాదులు

జంట జలాశయాల్లో (ఉస్మాన్ సాగర్, హుస్మాన్ సాగర్) ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లలో ఏపీ కాంగ్రెస్ లీడర్లకు చెందిన ఫామ్ హౌజ్ నిర్మాణాలను సై‌తం హైడ్రా నేలమట్టం చేసింది. దీంతో ఆ రాష్ట్రా నికి చెందిన సీనియర్ లీడర్లు నేరుగా కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా సొంత ప్రభుత్వంలోనే తమకు అ న్యాయం జరుగుతోందని వారు ఆవేదన వ్యక్తం చేసినట్టు టాక్. అలాగే హైదరాబాద్ చుట్టూ ఉ‌న్న కొందరు సీనియర్ కాంగ్రెస్ లీడర్లు సైతం రేవంత్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. వెంటనే కూల్చివేతలను నిలిపివేసే విధంగా ఆదేశాలు ఇవ్వాలని కో‌రగా, అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందనే విషయాలపై అధిష్టానం ఆరా తీసినట్టు సమాచా.

ఏఐసీసీ ఫోకస్

హైడ్రా కొనసాగిస్తోన్న అక్రమ నిర్మాణాల కూల్చివేతలపై అధిష్టానం ఫీల్డ్ లెవల్ ఒపీనియన్ సేకరించినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న వివిధ ఎన్జీవోలు, రిటైర్ట్ ఐఏఎస్, ఐపీఎస్‌లు, బిజినెస్ పర్సన్స్, కామన్ పబ్లిక్ నుంచి సమాచారం సేకరించారని సమాచారం. అయితే, మెజారిటీ పీపుల్ పాజిటివ్‌గా రెస్పాండ్ అవడం‌తో ప్రభుత్వం చేపడుతున్న డ్రైవ్‌ను కొనసాగించాలని సూచించినట్లు టాక్. ఈ మధ్య ఢిల్లీ టూర్ సమయంలో సీఎం రేవంత్ సైతం హైడ్రా కార్యక్రమాలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారనే ప్రచారం కూడా ఉంది.


Similar News