కౌన్ బనేగా TPCC నయా చీఫ్..? టీ-కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికపై AICC కసరత్తు స్టార్ట్

పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో పాటు మరి కొన్ని నెలల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్ ఎన్నికపై

Update: 2024-06-27 10:11 GMT

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికలు ముగియడంతో పాటు మరి కొన్ని నెలల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో తెలంగాణ పీసీసీ చీఫ్ ఎన్నికపై ఏఐసీసీ కసర్తతు స్టార్ట్ చేసింది. ప్రస్తుత టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పదవి కాలం ఈ నెలతో ముగియనుండటంతో కొత్త అధ్యక్షుడి ఎన్నికపై కాంగ్రెస్ హై కమాండ్ దృష్టి సారించింది. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో ఆయనకు అటు ప్రభుత్వ పాలన, ఇటు పార్టీ వ్యవహరాలు చక్కదిద్దడం బర్డెన్‌ అవ్వడంతో పాటు.. ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారం ఒక వ్యక్తికి ఒకే పదవి రూల్ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్ష పగ్గాలు మరొకరికి ఇవ్వాలని ఏఐసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ ఎన్నికపై ఏఐసీపీ కసరత్తు మొదలు పెట్టింది.

ఇందులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నాయకులకు టీపీసీసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. టీపీసీసీ చీఫ్ ఎన్నిక గురించి చర్చించనున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య నాయకులు అందుబాటులో ఉండాలని ఏఐసీసీ ఆదేశించింది. గురువారం రాత్రి 8 గంటలకు ముఖ్య నేతలతో సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దీపాదాస్ మున్షీ ఢిల్లీలో భేటీ కానున్నారు. ఈ భేటీకి హాజరు కావాలని స్టేట్ టాప్ లీడర్స్‌కు ఏఐసీసీ ఇన్విటేషన్ పంపింది. ప్రస్తుతం తెలంగాణ కేబినెట్ దాదాపు ఢిల్లీలోనే ఉంది. సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు వివిధ పనుల నేపథ్యంలో హస్తిన టూర్‌కు వెళ్లారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా మణుగూరు పర్యటనలో ఉన్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఏఐసీసీ ఆదేశించిన నేపథ్యంలో ఈ పర్యటనను రద్దు చేసుకుని ఢిల్లీకి బయలు దేరారు.

ఢిల్లీలో మకాం వేసిన పీసీసీ చీఫ్ ఆశవహులు

టీపీసీసీ చీఫ్ మార్పు నేపథ్యంలో ఆశవాహులు ఇప్పటికే ఢిల్లీలో మకాం వేశారు. ఏఐసీసీ అగ్రనేతలతో భేటీతో అవుతూ టీపీసీసీ పోస్ట్ కోసం ఎవరికి వారు ప్రయత్నాలు షూరు చేశారు. ఏఐసీసీ అగ్రనేతలను ప్రసన్నం చేసుకోవడం పాటు.. స్టేట్ లీడర్లతో ఉన్న పరిచయాలను ఉపయోగించుకుని లాబీయింగ్ మొదలుపెట్టారు. తెలంగాణ సీఎం పోస్ట్ రెడ్డి వర్గానికి దక్కడంతో టీపీసీసీ పదవి బీసీలకు ఇవ్వాలని పార్టీ హై కమాండ్ భావిస్తోన్న నేపథ్యంలో ఈ వర్గానికి చెందిన ఆశవాహులు ఇప్పటికే ఢిల్లీ బాట పట్టారు. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్, మంత్రి సీతక్క, జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు టీపీసీసీ చీఫ్ పోస్ట్ రేసులో ఉన్నారు.

ఇప్పటికే మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్, సీతక్క ఢిల్లీలో మకాం వేశారు. సీతక్క బుధవారం కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలతో భేటీ కాగా, గురువారం పార్లమెంట్ హాల్‌లో కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీని ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ కలిశారు. టీపీసీసీ చీఫ్ పోస్ట్ ఆశిస్తున్న వారిలో మెజార్టీ వ్యక్తులు సీఎం రేవంత్ రెడ్డి మనుషులు అనే పేరు ఉండటంతో.. రేవంత్ రెడ్డి హై కమాండ్‌కు ఎవరి పేరును సూచిస్తారు..? తన పోస్ట్‌ను ఎవరికీ కట్టబెడతారు..? అన్నది స్టేట్ పాలిటిక్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. టీపీసీసీ చీఫ్ ఎన్నికకు ఏఐసీసీ కసరత్తు మొదలుపెట్టడంతో రాష్ట్రానికి కాంగ్రెస్ కొత్త బాస్ ఎవరు అవుతారనేదానిపై రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.


Similar News