ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే: మల్లికార్జున ఖర్గే ఫైర్
ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే, వారిద్దరికి పేదల కష్టాలు పట్టవని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం
దిశ, వెబ్‌డెస్క్: ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ ఇద్దరూ ఒక్కటే, వారిద్దరికి పేదల కష్టాలు పట్టవని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నల్లగొండలో నిర్వహించన విజయభేరి సభకు ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఇందిరమ్మ ఏమి చేయలేదని సీఎం కేసీఆర్ చెబుతున్నారు.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కట్టించింది ఇందిరా గాంధీనే అని కౌంటర్ ఇచ్చారు. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ లేకుంటే తెలంగాణ ఎలా ఉండేదని ప్రశ్నించారు. దేశంలో ఆహార ధాన్యాల కొరత తీర్చింది ఇందిరాగాంధీ అని గుర్తు చేశారు. దేశంలో పేదరిక నిర్మూలన కోసం 20 సూత్రాల పథకం తీసుకువచ్చింది కూడా ఇందిరా గాంధీనే అని అన్నారు.
ఇందిరా గాంధీ ఏమి చేయలేదన్న కేసీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నాని అన్నారు. తెలంగాణలో అవినీతి భారీగా పెరిగిపోయిందని.. భూమి, ఇసుక, మద్యం కుంభకోణాల్లో కేసీఆర్ కుటుంబ కూరుకుపోయిందని ఆరోపించారు. మోడీతో అంటకాగడం తప్ప కేసీఆర్‌కు ఏమి తేలియదని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని, రాష్ట్రంలో మళ్లీ ఇందిరమ్మ పాలన తీసుకువస్తానమి దీమా వ్యక్తం చేశారు. పేదలకు, అణగారిన వర్గాలను ఆదుకోవడమే ఇందిరమ్మ రాజ్యం లక్షమని అన్నారు.