అగ్నివీర్ బోగస్.. ఏఐసీసీ ఎక్స్ సర్వీస్ మెన్ వింగ్ కల్నల్ హరీష్​ చౌదరి

అగ్నివీర్ అనే ప్రోగ్రామ్ అంతా బోగస్ అని ఏఐసీసీ ఎక్స్ సర్వీస్ మెన్ వింగ్ కల్నల్ హరీష్​ చౌదరి పేర్కొన్నారు.

Update: 2024-05-11 16:07 GMT

దిశ, తెలంగాణ బ్యూరో అగ్నివీర్ అనే ప్రోగ్రామ్ అంతా బోగస్ అని ఏఐసీసీ ఎక్స్ సర్వీస్ మెన్ వింగ్ కల్నల్ హరీష్​ చౌదరి పేర్కొన్నారు. శనివారం ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడుతూ...అగ్నివీర్ ద్వారా చేపట్టిన రిక్రూట్ మెంట్ లో సైనికులంతా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఇప్పటి వరకు సైనికులు రెగ్యులర్ కాలేదన్నారు. బెనిఫిట్స్ అన్నీ కోల్పోతున్నారన్నారు. ఎప్పుడు రెగ్యులర్ చేస్తారో? తెలియని సందిగ్దత ఏర్పడిందన్నారు. ఇక వన్ నేషన్, వన్ పెన్షన్ అంటూ బీజేపీ ఇండియన్ ఆర్మీకి మోసం చేసిందన్నారు. అదానీ, అంబానీల కోసం బీజేపీ పెద్ద కుట్రలకు పాల్పడుతుందన్నారు.

పదేళ్లలో బీజేపీ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. దేశంలో ఇప్పుడు క్లిష్ట పరిస్థితి లో ఉన్నదని, కేంద్ర ప్రభుత్వం లోని బీజేపీ, అదానీ, అంబానీ లకు దోచి పెట్టుండు తప్ప ఏమీ చెయ్యలేదన్నారు. అందుకే మార్పు రావాల్సిన అవసరం ఉన్నదన్నారు. కాంగ్రెస్ కు అండగా ఉండాలన్నారు. కాంగ్రెస్ పార్టీ పేద బడుగు బలహీన వర్గాల వారి కి మద్దతుగా ఉన్నదన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో ద్వారా న్యాయ యాత్ర చేశాడన్నారు. పేదల, బడుగు బలహీన వర్గాల సమస్యలను తెలుసుకుంటూ పరిష్కారం కోసం కృషి చేసేందుకు ప్రత్యేక ప్రణాళిక తయారు చేశారన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ కి ఓటమి తప్పదన్నారు. ప్రజలు ఇంటికి పంపించుడు పక్కా అంటూ పిలుపు నిచ్చారు. కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం ఖాయమన్నారు.

Read More..

Breaking: నవనీత్ కౌర్‌పై కొత్త కేసు.. 15 సెకన్లు చాలు.. వ్యాఖ్యలపై క్రిమినల్ కేసు నమోదు 

Tags:    

Similar News