డిగ్రీ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. అడ్మిషన్లు ప్రారంభం

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ(బీఏ/బీకాం/బీఎస్సీ) కోర్సులు, పీజీ(ఎంఏ/ఎంకాం/ఎంఎస్సీ) కోర్సులు, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు విద్యార్థి సేవల విభాగ డైరెక్టర్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు.

Update: 2024-02-11 14:21 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ డిగ్రీ(బీఏ/బీకాం/బీఎస్సీ) కోర్సులు, పీజీ(ఎంఏ/ఎంకాం/ఎంఎస్సీ) కోర్సులు, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశానికి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు విద్యార్థి సేవల విభాగ డైరెక్టర్ డాక్టర్ ఎల్వీకే రెడ్డి ఆదివారం ప్రకటనలో తెలిపారు. ఆయా కోర్సుల్లో చేరడానికి విద్యార్హతలు, ఫీజు, కోర్సులు, తదితర వివరాలను www.braouonline.in లేదా www.braou.ac.in లో పొందవచ్చని వెల్లడించారు. కాగా రిజిస్ట్రేషన్‌కు ఈనెల 29వ తేదీ వరకు అవకాశం కల్పిచినట్లు ఆయన స్పష్టం చేశారు. కాగా, రూ.200 ఆలస్య రుసుముతో మార్చి 31వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.

విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా డిగ్రీ, పీజీ ప్రవేశాల కోసం నమోదు చేసుకోవాలని సూచించారు. అడ్మిషన్/ట్యూషన్ ఫీజును క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్ ద్వారా లేదా టీఎస్/ఏపీ ఆన్‌లైన్ ఫ్రాంచైజ్ సెంటర్ల ద్వారా మాత్రమే చెల్లించాలన్నారు. ఆన్ లైన్ లో నమోదు, ఇతర అంశాలపై సందేహాలపై సమీపంలోని అధ్యయన కేంద్రంలో సంప్రదించాలని సూచించారు. లేదంటే విశ్వవిద్యాలయ హెల్ప్ డెస్క్ 7382929570/580 లేదా 040-23680222/333/555 నంబర్లకు సంప్రదించవచ్చని ఎల్వీకే రెడ్డి సూచించారు.

Tags:    

Similar News