మావోయిస్టులకు యువత సహకరించవద్దు : డీఎస్పీ సదయ్య
గిరిజన యువత మావోయిస్టులకు సహకరించవద్దని డీఎస్పీ సందయ్య అన్నారు.
దిశ, ఆసిఫాబాద్: గిరిజన యువత మావోయిస్టులకు సహకరించవద్దని డీఎస్పీ సందయ్య అన్నారు. మంగళవారం సిర్పూర్ మండలంలోని కాకడ బుడ్డి, పవర్ గూడ, పంగిడి మావోయిస్టు ప్రభావిత గ్రామాల్లో జైనూర్ సీఐ అంజయ్య సిర్పూర్ (యు) ఎస్సై మాధవ్, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండర్ రాకేష్ కుమార్ బలగాలతో కలిసి గ్రామాలు సందర్శించి ఆయన మాట్లాడారు. గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టులు సంచరించే అవకాశం అధికంగా ఉంటుందని, వారి మాయమాటలు నమ్మి తమ జీవితాలను నాశనం చేసుకోవద్దని గిరిజన యువతకు సూచించారు. గ్రామాల్లో అపరిచిత వ్యక్తుల వస్తే పోలీసులకు లేదా 100 కాల్ చేసి సమాచారం ఇచ్చి సహకరించాలన్నారు. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటారని, ఏ సమస్యలు ఉన్న పోలీసుల ద్వారా పరిష్కరించుకోవాలని తెలిపారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ చదువు పై దృష్టి సారించాలన్నారు. అనంతరం సిర్పూర్ (యు) మండల కేంద్రంలో కవాతు చేపట్టి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.