ముదిరిన ఇథనాల్ ఫ్యాక్టరీ లొల్లి

నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ కొనసాగుతున్న దీక్షలు తీవ్ర రూపం దాల్చాయి.

Update: 2024-11-26 10:12 GMT

దిశ,భైంసా : నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలంలో నిర్మిస్తున్న ఇథనాల్ ఫ్యాక్టరీని రద్దు చేయాలంటూ కొనసాగుతున్న దీక్షలు నేడు తీవ్ర రూపం దాల్చాయి. దీక్షలో భాగంగా ఇథనాల్ వ్యతిరేక జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం దిలావర్పూర్ బంద్​కు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వ్యాపార, వాణిజ్య సంస్థలు, పాఠశాలలు సైతం స్వచ్ఛందంగా బంద్​లో పాల్గొని మద్దతు తెలిపాయి. అనంతరం భైంసా - నిర్మల్ జాతీయ రహదారిపై నాలుగు గ్రామాల ప్రజలు మహాధర్నా చేపట్టారు.

    ఈ మహాధర్నాలో మహిళలు, పిల్లలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు శ్రీహరిరావు, బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి కనబడటం లేదంటూ ప్లకార్డులు పట్టుకుని ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ధర్నాతో జాతీయ రహదారిపై దాదాపు 10 కిలోమీటర్ల మేర ఇరువైపులా వాహనాలు నిలిచిపోగా ఇతర మార్గాల గుండా వాహనాలను మళ్లిస్తున్నారు. నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 


Similar News