న‌ష్టపోయిన రైతులను ఆదుకుంటాం

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట‌లు న‌ష్ట‌పోయిన రైతులు అధైర్య‌ప‌డ‌వ‌ద్ద‌ని ప్ర‌భుత్వం త‌ప్ప‌కుండా ఆదుకుంటుంద‌ని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క రైతుల‌కు భ‌రోసా నిచ్చారు.

Update: 2024-09-07 12:18 GMT

దిశ, ఉట్నూర్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట‌లు న‌ష్ట‌పోయిన రైతులు అధైర్య‌ప‌డ‌వ‌ద్ద‌ని ప్ర‌భుత్వం త‌ప్ప‌కుండా ఆదుకుంటుంద‌ని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆత్రం సుగుణక్క రైతుల‌కు భ‌రోసా నిచ్చారు. శనివారం ఉట్నూర్ మండల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పులిమడుగు గ్రామాన్ని సంద‌ర్శించి వ‌ర‌ద‌ల‌కు దెబ్బ‌తిన్న పంట‌ పొలాల‌ను, రహదారులను, కల్వర్టులను ప‌రిశీలించారు. రైతులతో మాట్లాడి గ్రామంలో పంట నష్టాన్ని తెలుసుకున్నారు.

    మ‌రికొద్ది నెల‌ల్లో చేతికొచ్చే ప‌త్తి, సోయా పంట కోల్పోయిన రైతులు ఎవ‌రూ అధైర్య‌ప‌డ‌వ‌ద్ద‌ని, రాష్ట్రంలో ఉన్న ప్ర‌భుత్వం ప్ర‌జా ప్ర‌భుత్వ‌మ‌ని, న‌ష్ట‌పోయిన రైతుల‌కు ప‌రిహారం చెల్లించి అండ‌గా ఉంటుంద‌ని భ‌రోసా క‌ల్పించారు. ఆమె వెంట ఎస్టీ సెల్ రాష్ట్ర కన్వీనర్ సునీల్ జాదవ్, మాజీ సర్పంచ్ సరిత శ్రీనివాస్ జాదవ్, నాయకులు, రైతులు రాజలింగు, విష్ణు, బలిరామ్,ఆడే సురేష్, భూమన్న, ఆడే ప్రవీణ్, రాథోడ్ సురేష్, హన్ను సింగ్, రాజు, రాజేశ్వర్, శేషారావు ఉన్నారు. 

Tags:    

Similar News