ఆదిలాబాద్ జిల్లాలో కళాకారులకు కొదవలేదు : జోగు రామన్న
ఆదిలాబాద్ అందాలు సినీ పరిశ్రమతో పాటు టూరిస్టులు సైతం ఆకట్టుకుంటాయని,అదేవిధంగా జిల్లాలో కళలకు,కళాకారులకు కొదవ లేదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు.
దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ అందాలు సినీ పరిశ్రమతో పాటు టూరిస్టులు సైతం ఆకట్టుకుంటాయని,అదేవిధంగా జిల్లాలో కళలకు,కళాకారులకు కొదవ లేదని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. యువత సినిమా రంగంలో తమ కలను నిరూపించుకుంటూ ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. శనివారం యాదవ సంఘం భవనంలో నూతన సినిమా ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన క్లాప్ కొట్టి అనాథ ప్రేమా సినిమాను ప్రారంభించారు. ఏబి క్రియేషన్స్ ఆధ్వర్యంలో డైరెక్టర్ గాజు గౌడ్ దర్శకత్వంలో నూతన చిత్రం అనాథ ప్రేమ షూటింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొని నటీనటులకు శుభాకాంక్షలు తెలియజేశారు. మొదట వినాయకుడి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… యువత కళానైపుణ్యానికి పదును పెడుతూ చిత్ర పరిశ్రమల్లో కూడా రాణించాలని పిలుపునిచ్చారు.. గత బిఆర్ఎస్ ప్రభుత్వం రూ. 4వేల కోట్లతో ఆదిలాబాద్ ను గణనీయంగా అభివృద్ధి చేసుకోవడం జరిగిందని గుర్తు చేశారు.ఇందులో చిత్రం యూనిట్ సభ్యులు డైరెక్టర్ గజ్జు గౌడ్,భూపతి, నారాయన్ రెడ్డి.హీరోలు కళ్యాణ్,హీరో బిమేష్,హీరోయిన్ యోగితా, విలన్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.