పోలీసులు అన్యాయంగా కేసులు పెట్టారు
మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో తనకు న్యాయం చేయాలని ఓ వివాహిత మూడేళ్ల కూతురుతో ఆందోళనకు దిగింది.
దిశ, మంచిర్యాల: మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ ఆవరణలో తనకు న్యాయం చేయాలని ఓ వివాహిత మూడేళ్ల కూతురుతో ఆందోళనకు దిగింది. మంచిర్యాల విద్యుత్ శాఖలో సబ్ ఇంజనీర్‌గా పని చేస్తున్న నాగ శ్వేత తన తమ్ముడి పై పోలీసులు అన్యాయంగా కేసులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త రాజకుమార్ తన పై వేధింపులకు గురి చేస్తున్నాడని మంచిర్యాల పోలీస్ స్టేషన్లో పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని, కుటుంబ కలహాలతో తన మూడేళ్ల చిన్నారితో తన తల్లి వద్ద ఉంటున్న తనను భర్త రాజకుమార్ నిత్యం వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఆ విషయంపై తన తమ్ముడు అన్వేష్ నిలదీశాడని, అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎటువంటి విచారణ చేయకుండా కేసులు నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తను పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకుండా, తప్పుడు కేసులు పెట్టి తన తమ్ముడు అన్వేష్‌ను ఎస్ఐ మోకాళ్ళపై నిలబెట్టారని కన్నీటి పర్యంతమైంది. పోలీసులు విచారణ చేసి తన భర్త, కుటుంబ సభ్యుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది.