మంత్రి సీతక్కకు రుణపడి ఉంటాం.. రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు..

బోథ్ మండలంలోని ధన్నూర్ బి గ్రామ ప్రజల చిరకాల కోరిక నూతన వంతెన నిర్మాణం.

Update: 2024-10-17 09:01 GMT

దిశ, బోథ్ : బోథ్ మండలంలోని ధన్నూర్ బి గ్రామ ప్రజల చిరకాల కోరిక నూతన వంతెన నిర్మాణం. దీనికి గాను మూడు కోట్ల 30 లక్షల రూపాయలు మంజూరు చేసిన జిల్లా ఇంఛార్జి మంత్రి సీతక్కకి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతూ సీతక్క చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు ఆ గ్రామ ప్రజలు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో తమ గ్రామాన్ని సందర్శించి హై లెవెల్ వంతెన నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని మంత్రి హామీ ఇచ్చారన్నారు.

అధికారులను పంపించి నివేదికలు తెప్పించుకొని ఇచ్చిన మాటను తక్కువ కాలంలో పూర్తిచేసిన మంత్రి సీతక్కకి, రాష్ట్ర ప్రభుత్వానికి ఎల్లవేళలా అండగా ఉంటామని ప్రజలు తెలిపారు. రాష్ట్ర మంత్రికి, ఇంజనీరింగ్ అధికారులకు వినతి పత్రాలు సమర్పిస్తూ నిధుల మంజూరు విషయంలో అన్నీ తానై ముందు నడిచిన బోథ్ నియోజకవర్గ ఇంచార్జి ఆడే గజేందర్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భోడ్డు గంగారెడ్డి, ధనుర్ గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, యువజన సంఘాల సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.


Similar News