గోలేటి ఓసీపీకి అటవీ శాఖ అనుమతి ఇప్పించాలి..

బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఓసీపీకి అటవీ శాఖ అనుమతులు త్వరతగతిన ఇప్పించాలని ఏరియా ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్ కోరారు.

Update: 2024-10-17 09:15 GMT

దిశ, తాండూర్ : బెల్లంపల్లి ఏరియాలోని గోలేటి ఓసీపీకి అటవీ శాఖ అనుమతులు త్వరతగతిన ఇప్పించాలని ఏరియా ఐఎన్టీయూసీ ఉపాధ్యక్షుడు పేరం శ్రీనివాస్ కోరారు. ఆసిఫాబాద్ పర్యటనకు వచ్చిన రాష్ట్ర మంత్రి సీతక్కను బుధవారం రాత్రి ఐఎన్టీయూసీ నేతలు ఆమెను కలిసి వినతి పత్రం అందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోలేటి ఓసీపీ ఏర్పాటుకు అటవీ అనుమతుల కోసం కొందరు అధికారులు నిర్లక్ష్యంగా, కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఓసీపీ రాకుండా ఉన్నతాధికారులకు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఆయన ఆరోపించారు. గోలేటి ఓసీపీ ప్రారంభమైతే దాదాపు 2వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్నారు. గోలేటీ ఓసీపీ ఏర్పాటుకు అనుమతులు ఇప్పించి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని నిరూపించాలని మంత్రిని ఆయన కోరారు.


Similar News