ఆదివాసీ మహిళలపై జిహాదీ పేరుతో బలత్కారాలు : తుడుం దెబ్బ

జైనూరులో ఆదివాసీ మహిళపై అత్యాచారం, హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు ఎస్కే. మగ్దుంను వెంటనే ఉరితీయాలని శనివారం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర బంద్ విజయవంతమైంది.

Update: 2024-09-21 12:08 GMT

దిశ,అదిలాబాద్ : జైనూరులో ఆదివాసీ మహిళపై అత్యాచారం, హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు ఎస్కే. మగ్దుంను వెంటనే ఉరితీయాలని శనివారం ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర బంద్ విజయవంతమైంది. జిల్లా వ్యాప్తంగా బోథ్, ఉట్నూర్, ఇచ్చోడ, నెరడిగొండతో పాటు ప్రధాన మండలాల్లో ఆదివాసీలు పెద్ద ఎత్తున నిరసన చేపట్టి బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం 4 గంటల నుంచి ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో వద్ద బైఠాయించి రాస్తారోకో చేశారు. నిందితుడు మగ్దుంను వెంటనే ఉరితీయాలని, అదే విధంగా ఆదివాసీ మహిళకు ప్రభుత్వమే చికిత్స అందించాలని, ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలని తుడుం దెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహణ అధ్యక్షులు గోడం గణేష్ డిమాండ్​ చేశారు.

     అమాయక ఆదివాసీ మహిళలను జిహాదీ పేరుతో బలవంతపు పెళ్లిళ్లు, అత్యాచారాలు, మర్డర్లు చేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ పూర్తిగా విఫలమయ్యారని పేర్కొన్నారు. ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో తుడుం దెబ్బ రాష్ట్ర నాయకులు, అనుబంధ సంఘాలైన ఆదివాసీ గ్రామ పటేల్ ఫోరం, ఆదివాసీ మహిళా సంఘం నాయకులు, ఆదివాసీ యువజన, నిరుద్యోగ సంఘం నాయకులు గోడం గణేష్, వెట్టి మనోజ్, గోడం రేణుక, ఉయిక ఇందిర, సలాం వరుణ్, సోయాం లలితాబాయి, ఆత్రం గణపతి, తోడశం ప్రకాష్, కోట్నాక్ రామారావు, కుమ్ర గోవిందరావు పాల్గొన్నారు. 

Tags:    

Similar News