రైతుల ఖాతాల్లో రూ.76 కోట్ల 23 లక్షలు జమ
ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో 317 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి రూ. 76 కోట్ల 23 లక్షల నగదు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ తెలిపారు.
దిశ, మంచిర్యాల : ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లాలో 317 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి రూ. 76 కోట్ల 23 లక్షల నగదు రైతుల ఖాతాలలో జమ చేయడం జరిగిందని జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతీలాల్ తెలిపారు. జిల్లాలో ప్రతిపాదించిన 326 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలలో ఇప్పటి వరకు 317 కొనుగోలు కేంద్రాల ద్వారా 61 వేల 452 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఇందులో 18 వేల 82 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం ఉందన్నారు. సంబంధిత 5.144 వేల మంది రైతుల ఖాతాలలో రూ. 76 కోట్ల 23 లక్షలు జమ చేసినట్టు తెలిపారు. జిల్లాలో 24 రైస్ మిల్లులకు సీఎంఆర్ అనుమతులు జారీ చేసినట్టు చెప్పారు.