జైనూరులో 144 సెక్షన్ సడలింపు

కొమురం భీం జిల్లాలోని జైనూర్ మండలంలో జరిగిన ఘటన నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా విధించిన 144 సెక్షన్ అమలును ప్రజల సౌకర్యార్థం సడలించినట్లు శనివారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు.

Update: 2024-09-07 15:12 GMT

దిశ, కాగజ్ నగర్ : కొమురం భీం జిల్లాలోని జైనూర్ మండలంలో జరిగిన ఘటన నేపథ్యంలో శాంతి భద్రతల దృష్ట్యా విధించిన 144 సెక్షన్ అమలును ప్రజల సౌకర్యార్థం సడలించినట్లు శనివారం జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక చవితి. మీలాద్-ఉన్-నబి పండుగల నేపథ్యంలో ప్రజలు నిత్యావసరాల కొరకు ఉదయం ఎనిమిది గంటల నుండి పదకొండు గంటల వరకు, సాయంత్రం నాలుగు గంటల నుండి ఏడు గంటల వరకు సడలింపు చేసినట్లు పేర్కొన్నారు. ఘటన నేపథ్యంలో నిలిపివేసిన ఇంటర్నెట్ సేవలను జైనూర్, కేరిమేరి, సిర్పూర్, యు. లింగాపూర్, వాంకిడి, తిర్యాని మండలాలు మినహా మిగిలిన చోట పునరుద్ధరించినట్టు తెలిపారు. సంబంధిత శాఖ అధికారులు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పండుగలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కోరారు.

Tags:    

Similar News