లక్షెట్టిపేటలో స్వర్ణకారుల నిరసన
కులవృత్తిపై ఆధారపడిన స్వర్ణకారులకు చేయూతను అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ...Protest at Laksettipeta
దిశ, లక్షెట్టిపేట: కులవృత్తిపై ఆధారపడిన స్వర్ణకారులకు చేయూతను అందించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ స్వర్ణకారుల సంఘ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం లక్షెట్టిపేటలోని స్వర్ణకారులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక అంగడి బజార్ లోని తమ షాపులను బంద్ పెట్టి తహశీల్దాల్ కార్యాలయం వరకు ర్యాలీ తీశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన మెమోరండాన్ని తహశీల్దార్ జ్యోత్స్నకు అందజేశారు. అంతకుముందు సంఘ భవనంలో తెలంగాణ అమరవీరుడు శ్రీకాంతాచారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్వర్ణకార సంఘ నాయకులు దీప్ చంద్, సత్తయ్య, సాగర్, భాస్కర్, రాజేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.