పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : ఎస్పీ డీవీ శ్రీనివాసరావు
మరో వ్యక్తి ప్రమేయం పైరవీలు లేకుండా నేరుగా
దిశ, ఆసిఫాబాద్ : మరో వ్యక్తి ప్రమేయం పైరవీలు లేకుండా నేరుగా పోలీస్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు సూచించారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజలతో మమేకమైన శాంతి భద్రతలు సమస్యలు తలెత్తకుండా చూస్తూ ప్రజలకు సేవ చేయడం జిల్లా పోలిసుల పని అని పేర్కొన్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న నిర్భయంగా పోలిస్ స్టేషన్ వచ్చి ఫిర్యాదు చేయాలని ప్రజలను కోరారు.