అభివృద్ధి పనుల్లో ప్రజలే క్వాలిటీ కంట్రోల్

నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి పనుల విషయంలో ప్రజలే క్వాలిటీ కంట్రోల్ అధికారులుగా వ్యవహరించాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు.

Update: 2024-03-03 14:17 GMT

దిశ, బెజ్జూర్: నియోజకవర్గంలో చేపట్టే అభివృద్ధి పనుల విషయంలో ప్రజలే క్వాలిటీ కంట్రోల్ అధికారులుగా వ్యవహరించాలని సిర్పూర్ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ఆదివారం పెంచికల్పేట్ మండలంలోని దర్గా పల్లి, చేడ్వాయి, గుండ్ల పేట, కొండపల్లి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద ప్రభుత్వం మందిర్ చేస్తున్న సీసీ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేసిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సిర్పూర్ నియోజకవర్గంలో జాతీయ ఉపాధి హామీ పథకం రూ. 10 కోట్లు సీసీ రోడ్లు సైట్ ట్రైన్లకు మంజూరు చేసిందని పనులు ప్రారంభమయ్యాయి అన్నారు.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం హితోధికంగా నిధులు సమకూరుస్తుందని తెలిపారు. సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

అలాగే గ్రామాల్లో ప్రజలు కూడా పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నారో లేదో తెలుసుకొని తమకు తెలియజేయవలసిందిగా కోరారు. ప్రజలే క్వాలిటీ కంట్రోల్ అధికారులుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు అనంతరం కొండపల్లి, చెడువాయి గ్రామాల్లో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిరాలకు భూమి పూజ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఒక్కో సబ్ సెంటర్ కు రూ. 20 లక్షలు చేస్తుందని తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన వైద్య సేవ నిర్మించడం జరుగుతుందన్నారు. ప్రమాణాల విషయంలో అధికారుల బ్రహ్మత్వం ఉండాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన వెంట బీజేపీ మండల అధ్యక్షుడు జనగారి మధుకర్. నాయకులు నగేష్ తదితరులు ఉన్నారు.


Similar News