'అసమర్ధ ఎమ్మెల్యే వల్లే ఆ మున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోవడం లేదు'
సింగరేణి సంస్థ ద్వారా వేలకోట్ల రూపాయలు వస్తున్న నస్పూర్ మున్సిపాలిటీ మాత్రం అసమర్ధ ఎమ్మెల్యే వలన అభివృద్ధికి నోచుకోవడం లేదని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు వేరబెల్లి రఘునాథ్ అన్నారు.
దిశ, నస్పూర్ : సింగరేణి సంస్థ ద్వారా వేలకోట్ల రూపాయలు వస్తున్న నస్పూర్ మున్సిపాలిటీ మాత్రం అసమర్ధ ఎమ్మెల్యే వలన అభివృద్ధికి నోచుకోవడం లేదని మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు వేరబెల్లి రఘునాథ్ అన్నారు. శుక్రవారం నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపల్లిలో ప్రజాగోస-బీజేపీ భరోసా కార్నర్ సమావేశాన్ని పట్టణ బీజేపీ అధ్యక్షుడు అగల్ డ్యూటీ రాజు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడు వేరబెల్లి రఘునాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నస్పూర్ మున్సిపాలిటీకి సింగరేణి సంస్థ ద్వారా వేలకోట్ల రూపాయల ఆదాయం ఉన్నమున్సిపాలిటీ అభివృద్ధికి నోచుకోవడం లేదని అన్నారు.
ఇక్కడి నిధులు సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాలకు తరలిస్తున్న ఎమ్మెల్యే మాత్రం అడ్డుకోవడం లేదని తెలిపారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం గతఎన్నికల సమయంలో పేద ప్రజలకు ఇచ్చిన హామీలు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, దళితులకు దళిత బంధు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి, రెండు లక్షల ఉద్యోగాలు వంటి అనేక హామీలు ఇచ్చి ఇప్పటివరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని అన్నారు. ఈ రాష్ట్రప్రభుత్వం సంక్షేమ పథకాలను అందించడంలో పూర్తిగా విఫలమైందని, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రజనీష్ జైన్, సత్రం రమేష్, ఈర్ల సదానందం, బుద్దే రాజన్న, మాల్క రాజేశం, కొండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.