తోళ్ళ పరిశ్రమని సందర్శించిన ఎమ్మెల్యే వివేక్..

మందమర్రిలోని స్థానిక పాల చెట్టు సమీపంలోని తొళ్ళ పరిశ్రమని ఎమ్మెల్యే వివేక్ సందర్శించారు.

Update: 2024-11-07 03:38 GMT

దిశ, మందమర్రి : మందమర్రిలోని స్థానిక పాల చెట్టు సమీపంలోని తొళ్ళ పరిశ్రమని ఎమ్మెల్యే వివేక్ సందర్శించారు. ఈ ఫ్యాక్టరీ చుట్టూ ప్రహరీ లేకపోవడం వల్ల ఈ స్థలాన్ని పక్కనే ఉన్న సోలార్ పవర్ ప్లాంట్ కాంట్రాక్టర్ ఉద్యోగులు ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరిగాయని దళిత సంఘ నాయకులు ఫిర్యాదు చేశారు. ఈ స్థలం రూట్ మ్యాప్ ని కూడా ఎమ్మెల్యే చూశారు. ఎలాంటి నిర్మాణాలు ఈ స్థలంలో నిర్మించవద్దని సింగరేణి, మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో లెదర్ పరిశ్రమల గురుంచి మాట్లాడామని అన్నారు. డీఎంఎఫ్టీ నిధుల నుండి ముఖ్యమంత్రి 20 లక్షల రూపాయలు మంజూరు చేశారని అన్నారు. తక్షణమే చుట్టూ ప్రహరీ నిర్మించే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తామని చెప్పారు.

అలాగే మార్నింగ్ వాక్ లో భాగంగా ఎమ్మెల్యే వివేక్ మందమర్రిలోని 6, 7, 10 వార్డులో తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తాగు నీరు, డ్రైనేజీ సమస్యల గురించి తెలుసుకొని పరిష్కారానికి మున్సిపల్ అధికారులకు సూచించారు. మనం ఆరోగ్యంగా ఉంటేనే చేసే పనిలో నిబద్ధత, శరీరం సహకరిస్తుందన్నారు. అందుకే అందరూ వాకింగ్, యోగా ధ్యానం వంటివి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, సిబ్బంది, ఎన్.వెంకటేశ్వర్లు, దళిత సంఘం నాయకులు కొలగూరి విజయకుమార్, మంతెన సుమన్, సంగి సంతోష్, శనిగారపు కుమార్, MRPS నాయకులతో పాటు సీనియర్ నాయకులు సోత్కు సుదర్శన్, నోముల ఉపేందర్, గుడ్ల రమేష్, తిరుమల్ రెడ్డి, కిరణ్, ఎండీ పాషా తిరుపతి, నర్సింగ్, బత్తుల సరిత, ఇసాక్, వార్డు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ఎస్ఐ రాజశేఖర్ పర్యవేక్షణలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Tags:    

Similar News