బీఆర్ఎస్ తో దేశంలో విప్లవాత్మక మార్పు : మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
బీఆర్ఎస్ జాతీయ పార్టీతో దేశంలో విప్లవాత్మక మార్పు రానుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
దిశ, నేరడిగొండ : బీఆర్ఎస్ జాతీయ పార్టీతో దేశంలో విప్లవాత్మక మార్పు రానుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. గురువారం ధన్నూరు గ్రామం వద్ద బీటీ రోడ్ నిర్మాణ పనులను బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ 14 ఏండ్లు అలుపెరగకుండా పోరాటం చేసి సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని, కోట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇవాళ దేశానికి ఆదర్శంగా నిలిపారని అన్నారు.
తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్తు, కాళేశ్వరం, మిషన్ భగీరథ, ఆసరా పింఛన్లు వంటి పథకాలు బగుడు, బలహీన వర్గాలను ఆర్థికంగా బలోపేతం చేశాయని పేర్కొన్నారు. తెలంగాణ పథకాలు దేశవ్యాప్తంగా అమలు కావాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని ఎంతో మంది కోరుకున్నారడానికి దేశ వ్యాప్తంగా లభిస్తున్న మద్దతు నిదర్శనం అని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దు మహారాష్ట్రలోని గ్రామాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున్న స్వాగతిస్తున్నారని చెప్పారు.
తెలంగాణలో రాజకీయ లబ్ధి పొందేందుకు బీజీపీ కేంద్ర మంత్రులు ఇక్కడ రాజకీయ విమర్శలు చేస్తున్నారని, ఢిల్లీ వెళ్ళి ఇక్కడ అమలవుతున్న అనేక పథకాలకు ఎన్నో అవార్డులు ఇస్తున్నారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్దే ఆలంబనగా ముందుకు సాగుతున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని, అభివృద్దే తమ అంతిమ లక్ష్యమని, ఈ రోడ్డు నిర్మాణంతో అడిల్లి పోచమ్మ ఆలయానికి దూర భారం తగ్గుతుందని అన్నారు. భక్తుల రాకపోకలు సులవవుతుందని ఆయన తెలిపారు.
రాష్ట్ర రాజకీయలనే కాకుండా విజయ దశమి సందర్బంగా దేశ రాజకీయ స్థితిగతులను మార్చడానికి టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చడం శుభసూచకమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్, స్థానిక ఎంపీటీసీ నారాయణ రెడ్డి, ఎంపీపీ తుల శ్రీనివాస్, జడ్పీటీసీ సంధ్యారాణి, జడ్పీ కో ఆప్షన్ మెంబెర్ తాహెర్ బిన్, మండల కన్వీనర్ రుక్మాన్ సింగ్, ఏఎమ్ సీ ఛైర్మెన్ దావుల బోజన్న, బోథ్ సర్పంచ్ సురేందర్, రైతు బంధు అధ్యక్షులు నల్ల జగన్ మోహన్ రెడ్డి, నేరడిగొండ ఎంపీపీ సజన్ రాథోడ్, ఆత్మ చైర్మెన్ మల్లెపూల సుభాష్, రమణ గౌడ్, ఉమేశ్, సత్యనారాయణ, సదానందం, రాయల్, ఎలుక రాజు, బుచ్చన్న తదితరులు పాల్గొన్నారు.