గత ఎనిమిది సంవత్సరాలుగా జిల్లా టాప్ ఆ పాఠశాల విద్యార్థులు..

ప్రతి సంవత్సరం నిర్వహించే ఎన్ఎంఎంఎస్ (స్కాలర్షిప్) పరీక్షా ఫలితాల్లో జెడ్పీఎస్ఎస్ కిష్టాపూర్ విద్యార్థులు గత 8 సంవత్సరాల నుండి జిల్లాలో మొదటి స్థానంలో నిలుస్తున్నారు.

Update: 2023-03-12 09:07 GMT

దిశ, జన్నారం : ప్రతి సంవత్సరం నిర్వహించే ఎన్ఎంఎంఎస్ (స్కాలర్షిప్) పరీక్షా ఫలితాల్లో జెడ్పీఎస్ఎస్ కిష్టాపూర్ విద్యార్థులు గత 8 సంవత్సరాల నుండి జిల్లాలో మొదటి స్థానంలో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సంవత్సరం కూడా 15 మంది విద్యార్థులు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాడి మురళి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత శుక్రవారం వెలువడిన ఎన్ఎంఎంఎస్ ఫలితాల షార్ట్ లిస్ట్ లో పాఠశాల నుండి 15 మంది విద్యార్థులు ఎంపిక అయి జిల్లాలో మొదటి స్థానంలో నిలిచినట్టు తెలిపారు.

పాఠశాల ఉపాధ్యాయుల సమిష్టికృషియే ఈ విజయాలకు కారణమని, ప్రతి ఉపాధ్యాయుని కృషి వల్లనే ఈ విజయం సాధించామని అన్నారు. ఇప్పటి వరకు ఈ పాఠశాల నుండి 231 స్కాలర్షిప్ లు పొందిన ఏకైక పాఠశాల అని రాష్ట్రంలో కిష్టాపూర్ పాఠశాల నిలువడం గర్వంగా ఉందని అన్నారు. ఎన్ఎంఎంఎస్ (2022-23) ఫలితాలలో కిష్టాపూర్ విద్యార్థులు 15 మంది ఎంపికతో మంచిర్యాల జిల్లాలో అత్యధిక స్కాలర్షిప్ లను సాధించి మరోసారి చరిత్ర సృష్టించారు. ఇప్పటి వరకు జిల్లా పరిషత్ సెకండ్ పాఠశాల విద్యార్థులు 231 స్కాలర్షిప్ లను సాధించటం విశేషం.

Tags:    

Similar News