Possession of wood : అక్రమ కలప పట్టివేత

జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో జన్నారం రేంజి అధికారి సుష్మరావు ఆధ్వర్యంలో తన సిబ్బందితో కలిసి బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు.

Update: 2024-07-25 09:49 GMT

దిశ,జన్నారం : జన్నారం మండలంలోని కిష్టాపూర్ గ్రామంలో జన్నారం రేంజి అధికారి సుష్మరావు ఆధ్వర్యంలో తన సిబ్బందితో కలిసి బుధవారం రాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కిష్టాపూర్ గ్రామానికి చెందిన మల్లేష్ ఇంట్లో నిల్వ ఉంచిన కలపను పట్టుకున్నారు. పట్టుకున్న కలప విలువ దాదాపు 9 వేలు ఉంటుందన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కలపను రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు ఎప్ఆర్ఓ తెలిపారు. ఈ దాడిలో డిప్యూటీ ఆఫీసర్ మమత, సెక్షన్ ఆఫీసర్లు కిరణ్మయిజ్యోతి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News