వైద్యులు సమయపాలన పాటించకపోతే చర్యలు తప్పవు
ఐటీడీఏ పరిధిలో అన్ని పీహెచ్సీలలో వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని, లేని పక్షంలో శాఖ పరమైన చర్యలు తప్పవని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్త సిబ్బందిని హెచ్చరించారు.
దిశ, ఆదిలాబాద్: ఐటీడీఏ పరిధిలో అన్ని పీహెచ్సీలలో వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని, లేని పక్షంలో శాఖ పరమైన చర్యలు తప్పవని ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్త సిబ్బందిని హెచ్చరించారు. మంగళవారం స్థానిక ఐటీడీఏ పీవో ఛాంబర్‌లో వైద్య సిబ్బంది, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ.. ప్రతి ఆరోగ్య కేంద్రంలో మాత శిశు సంరక్షణ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. గర్భిణీ స్త్రీల వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, వ్యాధి నిరోధక టీకాలు వేయడంతో పాటు వారిని రెగ్యులర్‌గా చెకప్ లు చేస్తూ ఉండాలన్నారు. గర్భిణిలు, చిన్నారులకు టీకాలు వేయడంలో వంద శాతం పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పీహీచ్సీలలో నార్మల్ డెలివరీ చేయాలని, ఆరోగ్య కేంద్రాలలో మందుల కొరత లేకుండా చూసుకోవాలన్నారు. ఈ సమావేశంలో అదనపు జిల్లా వైద్యాధికారి డాక్టర్ బాలు, ఉమ్మడి జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓలు, మెడికల్ అధికారులు పాల్గొన్నారు.