నూతన జీపీ భవన నిర్మాణాలకు నిధులు మంజూరు..
బోథ్ నియోజక వర్గంలో కొత్తగా ఏర్పాటైనా ఆదివాసీ తండాల గ్రామ పంచాయతీలకు గిరిజనశాఖ జీవో నంబర్ 32 ప్రకారం నూతన జీపీభవనాలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ తెలిపారు.
దిశ, ఇచ్చోడ : బోథ్ నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటైనా ఆదివాసీ తండాల గ్రామ పంచాయతీలకు గిరిజనశాఖ జీవో నంబర్ 32 ప్రకారం నూతన జీపీభవనాలను రాష్ట్రప్రభుత్వం మంజూరు చేసిందని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ తెలిపారు. ఆదివారం ఆయన హైదరాబాద్ నుంచి సెల్ ఫోన్ లో 'దిశ' తో మాట్లాడారు.
నియోజకవర్గంలో 49 గ్రామపంచాయతీల భవననిర్మాణాలకు ఒక్క గ్రామపంచాయతీకి రూ. 20 లక్షల చొప్పున మొత్తం రూ. 9.80 కోట్లు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. గ్రామపంచాయతీ భవన నిర్మాణాలకు నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, గిరిజన శాఖ మంత్రివర్యులు సత్యవతి రాథోడ్, పంచాయతీ రాజ్ మంత్రి వర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు, దేవాదాయ శాఖ మంత్రివర్యులు ఇంద్రకరణ్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.