ఎన్నారై పాలసీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి

గల్ఫ్ కార్మికుల కోసం ఎన్నారై పాలసీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక (జీడబ్ల్యూఏసీ) వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణ ధోనికేని అన్నారు.

Update: 2024-03-10 13:15 GMT

దిశ, మామడ: గల్ఫ్ కార్మికుల కోసం ఎన్నారై పాలసీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక (జీడబ్ల్యూఏసీ) వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణ ధోనికేని అన్నారు. ఆదివారం మండలంలోని కొరటికల్ గ్రామంలో ఎన్నారై పాలసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్లి అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎవరైతే విదేశాలకు వెళ్తున్నారో ,విదేశాలలో ఉన్నారో వారి కోసమే గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్ల లింగారెడ్డి, జీడబ్ల్యూఏసీ సభ్యులు రాజు, అజ్మన్, నవీన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News