విద్యార్థులను వీడని ఫుడ్ పాయిజన్..గురుకుల ఆశ్రమాలకు ఏమైంది..?

గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో అధికారుల పర్యవేక్షణ

Update: 2024-11-07 10:15 GMT

దిశ, ఆసిఫాబాద్ : గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో అధికారుల పర్యవేక్షణ నిర్వహణ లోపంతో విద్యార్థుల పాలిట శాపంగా మారింది.ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గురుకులు. ఆశ్రమ పాఠశాలల్లో వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ సంఘాలతో విద్యార్థులు హడలెత్తి పోతున్నారు.గురుకుల ఆశ్రమ పాఠశాలలు అనగానే విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతులు అందుతాయని, తల్లిదండ్రులు తమ పిల్లలను గురుకుల. ఆశ్రమోన్నత పాఠశాలల్లో చేర్పించేందుకు ఎక్కువ మొగ్గు చూపుతున్నారు. కానీ ఈ మధ్య కాలంలో ఫుడ్ పాయిజన్ సంఘటనలు పిల్లల తల్లిదండ్రులు కలవర పడుతున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వారం వ్యవధిలో జరిగిన మూడు ఫుడ్ పాయిజన్ ఘటనల్లో 80 మంది విద్యార్థుల పైగా అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ఒక్క కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులే 60 మంది పైగా ఉన్నారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందంటంతో హైదరాబాద్ నిమ్స్ తరలించగా మరికొందరిని ఆసిఫాబాద్,కాగజ్ నగర్, మంచిర్యాల ఆస్పత్రుల్లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. పదిరోజుల కావస్తున్నా కోలుకోలేదు. ఇక నిర్మల్ జిల్లాలో ఓ విద్యార్థి మృతి చెందారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో ఫుడ్ పాయిజన్ లో 12 మంది విద్యార్థులు హాస్పిటల్ పాలయ్యారు.

ఆరుగురు అధికారుల సస్పెన్షన్..

నిర్మల్ జిల్లా కేంద్రంలోని మహాత్మా జ్యోతిబా పూలే బాలుర గురుకులలో 9వ తరగతి చదువుతున్న అయాన్ హుస్సేన్ మృతి చెందగా ఆ జిల్లా కలెక్టర్ సీరియల్ తీసుకొని నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. తాజాగా మంచిర్యాల కేంద్రంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్ డీటీడీవో,వార్డెన్ బుధవారం సస్పెండ్ చేశారు.

వాంకిడిలో కానరాని చర్యలు..

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని వాంకిడి గిరిజన ఆశ్రమోన్నత పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగిన విషయం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 60 మందికి పైగా విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఇందులో ముగ్గురు ఇంకా కోలుకోలేదు. ఫుడ్ పాయిజన్ జరిగి పది రోజులు కావస్తున్నా కలెక్టర్, ఐటీడీఏ పీవో బాధ్యులపై చర్యలు తీసుకోనే మాట అటుంచి,. కనీసం ఫుడ్ పాయిజన్ కు గల కారణాలను నేటికీ వెల్లడించలేదు. నాణ్యత లేని సరుకులతో ఫుడ్ పాయిజన్ జరిగిందని విద్యార్థినులు చెబుతున్న.. కలెక్టర్, పీవో పట్టనట్లు వ్యవహరిస్తున్నారని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు.


Similar News