సర్వేను పారదర్శకంగా చేయకపోతే చర్యలు తప్పవు : కలెక్టర్ రాజర్షి షా
ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేను
దిశ, ఉట్నూర్ : ప్రభుత్వం చేపడుతున్న సమగ్ర కుటుంబ సర్వేను పారదర్శకంగా చేయకపోతే చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. గురువారం ఉట్నూర్ పట్టణంలోని వార్డ్ నెంబర్ 10 లో చేపడుతున్న సర్వేను జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఐటీడీఏ పీఓ ఖూబ్ గుప్తా, ఉట్నూర్ సబ్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్ పరిశీలించారు. ఉట్నూర్ లో సర్వే వివరాలను ఎంపీడీఓ రాం ప్రసాద్, ఎంపీఓ మహేశ్ లను వివరాలు అడిగి తెలుసుకున్నారు. సర్వే బ్లాక్ ల ప్రకారం వివరాలను అధికారులను అడిగారు. ఇంటింటికి వేస్తున్న స్టిక్కరింగ్ లో పరీశీలించి, ప్రజలతో మాట్లాడారు. ఎన్యూమరేటర్ బ్లాక్ (ఈబీ) నెంబర్ లు బై(ఆబ్లిక్) వేయడం ఎంటని, ఎవరు చెప్పారని కలెక్టర్ అధికారులను అడిగారు.
వెంటనే డీపీఓతో ఫోన్ లో మాట్లాడారు. ఈబీలలో బై వేయడంతో ఎంపీడీవోపై అసహనం వ్యక్తం చేశారు. తిరిగి నూతన నెంబరింగ్ లు వేయాలని ఆదేశించారు. సర్వే చేయడంలో నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు. సర్వే పరిశీలినకు వచ్చిన కలెక్టర్ కు మాజీ వార్డ్ మెంబర్ బొడ్డు లింగమ్మ నీరు, రోడ్డు, డ్రైనేజీ, ఇళ్ల సమస్యలపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కలెక్టర్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంతకుముందు ఐటీడీఏ కార్యాలయ ముందు గిరిజన ఉద్యాన కేంద్రం నర్సరీ ని ప్రారంభించారు. కలెక్టర్ వెంట ట్రైనీ కలెక్టర్ అభిజ్ఞాన్ మాలవియ, ఉట్నూర్ జీపీ ఈఓ శంకర్, సిబ్బంది అజిత్, ఆయా శాఖల అధికారులు ఉన్నారు.