సీఎంఆర్ఎఫ్ పథకం వల్ల పేదలకు ఆర్థికంగా ఎంతో మేలు : ఖానాపూర్ ఎమ్మెల్యే
సీఎంఆర్ఎఫ్ పథకం వల్ల పేదలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని
దిశ,జన్నారం : సీఎంఆర్ఎఫ్ పథకం వల్ల పేదలకు ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. గురువారం జన్నారం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలోరూ. 10 లక్షల 40 వేల 500 విలువ గల 50 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.ఆపద సమయంలో సీఎంఆర్ఎఫ్ ఎల్ఓసీ పథకం ద్వారా రోగి ఆపరేషన్ కు అయ్యే ఖర్చును వెంటనే మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ పథకం వల్ల పేద ప్రజలకు ఆర్థికంగా ఎంతో మేలు చేకూరుతుందని పేర్కొన్నారు.
ఆదివాసీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి..
రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీ గిరిజనుల సంక్షేమానికి ప్రత్యేక కృషి చేస్తుందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. జన్నారం మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలోరూ. 1లక్ష 95 వేల విలువ గల 13 దండారి ఉత్సవాల చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేశారు.ఆదివాసులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే పండుగ దండారి అని పేర్కొన్నారు.రాష్ట్ర ప్రభుత్వం దండారి ఉత్సవాల నిర్వహణకు ప్రతి దండారికి రూ. 15 వేల చొప్పున అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దండారి ఉత్సవాలకురూ. 1కోటి 50 లక్షలు మంజూరు చేసిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ గ్రామాల పటేళ్లు, తదితరులు పాల్గొన్నారు.